Friday 29 October, 2010

Telangana Songs by Vinodh Kumar Mandhala

Song No:1
సల్ల సల్లగ లేవుర మన బ్రతుకులు తమ్ముడా

సల్ల సల్లగ లేవుర మన బ్రతుకులు తమ్ముడా
మెల మెల్లగా సాగర తెలంగాణా వీరుడా

పల్లెల్లని పాడుబడ్డై
నీలు లేక నల్ల బడ్డాయి.
పాలమూరు పాడాయే
కరీంనగర్ కుళ్ళి పాయె
ఆదిలాబాదు అరవబట్టే
నిజామాబాదు నల్లగొండ
ఖమ్మములో కరువోచ్చే
వరంగల్లు వంటింట్లో కుండలు కొట్లాడబట్టే
మెదకేమో మోడుబారే కండ్లెంబడి నీళుకారే
తాగానీకే కరువాయే కనీల్లె ఎరాయే

సల్ల సల్లగ లేవుర మన బ్రతుకులు తమ్ముడా
మెల మెల్లగా సాగర తెలంగాణా వీరుడా

అభివృద్ధి అంటాడు
అంత మీకే ఆంటాడు
ఆ ప్రాజెక్ట్ అంటాడు ఈ ప్రాజెక్ట్ అంటాడు
ఆరేళ్ళు గడచిపాయే అరలీటరు తేకపాయే
మట్టి కుండ ఆస సూపి ఎండి బిందె ఎత్క పాయె

సల్ల సల్లగ లేవుర మన బ్రతుకులు తమ్ముడా
మెల మెల్లగా సాగర తెలంగాణా వీరుడా

లగడగాడు జగడమాడే
టి జి గాడు పేచి పెట్టె
ఆడు ఈడు ఎగరబట్టే
మన బ్రతుకులు మనకంటే
కండ్లేందుకు మండబట్టే

సల్ల సల్లగ లేవుర మన బ్రతుకులు తమ్ముడా
మెల మెల్లగా సాగర తెలంగాణా వీరుడా 

Song No:2


ఎక్కి ఎక్కి ఏడ్వకమ్మ తెలంగాణా

ఎక్కి ఎక్కి ఏడ్వకమ్మ తెలంగాణా
నీకండంగా మేముంటమమ్మ తెలంగాణా
బక్కసిక్కినావమ్మ తెలంగాణా
నీ బాదలన్ని ఇన్ని కావు తెలంగాణా

కృష్ణమ్మా వచేనమ్మ తెలంగాణా
నీ కస్టాలు తీర్చలేదు తెలంగాణా
గోదారి గయ్యాళి తెలంగాణా
నీకు సవతిపోరు తప్పలేదు తెలంగాణా
సింగరేణి కాలనీలు తెలంగాణా
నీ సిగతరిగి నవ్వేనమ్మ తెలంగాణా
||ఎక్కి ఎక్కి||

రాష్ట్రమంతా పచ్చదనం తెలంగాణా
నీ నేలంతా కరవుమయం తెలంగాణా
పెద్ద పెద్ద పట్టణాలు తెలంగాణా
నీకు పెద్దదిక్కు లేదమ్మా తెలంగాణా
చిన్న ప్రాజెక్టులు తెలంగాణా
అవే నీకు పదివేలు తెలంగాణా
||ఎక్కి ఎక్కి||

నాగార్జున సాగారమ్మ తెలంగాణా
నాల్గు సుక్కలైన లేవమ్మ తెలంగాణా
పోలవరం ప్రాజెక్టు తెలంగాణా
నీ పోలు తేంపినాదమ్మ తెలంగాణా
పోతిరెడ్డి పాడమ్మ తెలంగాణా
నీకు పాడే కట్టనుందమ్మ తెలంగాణా
సుంకాసుల, దేవాదుల తెలంగాణా
సూసి ముర్వనీకే ఉన్నయమ్మ తెలంగాణా
||ఎక్కి ఎక్కి||

అండి గిండి అనేటోల్లకు తెలంగాణా
అహ దండిగా ధనముందమ్మ తెలంగాణా
మన పోరి పోరగాలు తెలంగాణా
అహ పాచి పని చేయబట్టే తెలంగాణా
ఆ రైతు హాయిగుండు తెలంగాణా
మరి మన రైతు మూల్గుతుండు తెలంగాణా
పప్పన్నం దేవుడెరుగు తెలంగాణా
సుక్క ఇసమైన కోనకున్నడు తెలంగాణా

ఎక్కి ఎక్కి ఏడ్వకమ్మ తెలంగాణా
నీకండంగా మేముంటమమ్మ తెలంగాణా
బక్కసిక్కినావమ్మ తెలంగాణా
నీ బాదలన్ని ఇన్ని కావు తెలంగాణా

Song No:3


తెలంగాణా సమర గీతం.
ఈ రేయి, ఆ రాయి చిరునవ్వుల పాపాయి
కదిలాయి, పాడాయి ఒక స్వేచా గీతం
ఆ గీతం పాడింది నవాబులకు చరమ గీతం
మరువలేము మనమెప్పుడు తెలంగాణా సమర గీతం ||2||

పల్లె కదిలింది, పిల్లా కదిలింది ||2||
పడచు కదిలింది, పడతీ కదిలింది
అది చూసిన నవాబులకు
నర నరాన, ఖన ఖనాన
ఉద్భావిందే బయోత్పాతం...... అదే స్వేచా గీతం
ఆ గీతం పాడింది నవాబులకు చరమ గీతం
మరువలేము మనమెప్పుడు తెలంగాణా సమర గీతం

చుక్క పొడచింది, చినుకు రాలింది ||2||
మొక్క మొలచింది, మానై వెలసింది
ఆ నీడలో, జడి వానలో
యుగ యుగాన, తర తరానా
వినుపించు అనునిత్యం ఆ ప్రళయ గీతం..... అదే స్వేచా గీతం
ఆ గీతం పాడింది నవాబులకు చరమ గీతం
మరువలేము మనమెప్పుడు తెలంగాణా సమర గీతం

Monday 26 July, 2010

చేలోరే విద్యార్ధి.... బన్ కే సిపాయీ

చేలోరేవిద్యార్ధి... బన్ కే సిపాయీ
లడన లడాయి
హమే లడన లడాయి ..


చదివింది చాలుర... చెలరేగి ఆడరా ..
ఈ దొంగల పనిపట్టంగా పెన్నే గన్నాయేర... పెన్నే గన్నాయేర
పుస్తకాలు వీడరా పోరు బాట సాగర
అక్షరాలే బరిసేలాయే బలమెంతో చూపరా...బలమెంతో చూపరా


చేలోరే విద్యార్ధి
బన్ కే సిపాయీ
లడన లడాయి
హమే లడన లడాయి ..


జల్సలింక మానర జండా చేతపట్టర
అసెంబ్లీ ఆవరణలో దిమ్మె కట్టి పాతర ...దిమ్మె కట్టి పాతర
సైన్మకు పోవోద్దుర సైన్యమై సాగర
తెలంగాణా నినాదమే మన హీరో సోదర... మన హీరో సోదర
చేలోరే విద్యార్ధి
బన్ కే సిపాయీ
లడన లడాయి
హమే లడన లడాయి ..


కాలేజి కాదురా కదన రంగమాయేరా
ఈ వలసవాద గుండెల్లో అణుబాంబై మ్రోగర ...అణుబాంబై మ్రోగర
బలిదానలోద్దురా బ్రతికి సాదించార
రేపటి నీ తెలంగాణా కళ్లారా చూడరా... కళ్లారా చూడరా


చేలోరే విద్యార్ధి
బన్ కే సిపాయీ
లడన లడాయి
హమే లడన లడాయి ..

Tuesday 20 July, 2010

స్సూడ సక్కనివాడు ఆ చందురూడు స్సూడాలేని వాడు మా చందురూడు

స్సూడ సక్కనివాడు ఆ చందురూడు 
స్సూడాలేని వాడు మా చందురూడు

మచ్చ లేనివాడు ఆ  చందురూడు
తనువంత మచ్చలున్న మా  చందురూడు

చీకటిని తరిమే వాడు ఆ చందురూడు 
చీకట్లో తరిమే వాడు మా  చందురూడు

చల్లాని వెన్నాలిచ్చు ఆ  చందురూడు
వెన్నెల్లో చల్ల దోచు మా  చందురూడు

పాపలకు ఆటబొమ్మ ఆ  చందురూడు
మా జన్మలతో ఆటలాడు మా  చందురూడు

పున్నమ్మిలో పురిని విప్పు ఆ చందురూడు
పాపంనే పున్నమానే మా చందురూడు

ఆమసనాగామాయే ఆ చందురూడు
మా యాసనాగాముచేసే మా చందురూడు

అందరికి మేనమామ ఆ చందురూడు
మామకే సున్నం పెట్టు మా చందురూడు

అందరికి జాబిల్లి ఆ చందురూడు
గోడ మీది పిల్లి మా చందురూడు

రెండేసి కన్నుల వాడు మా చందురూడు
ఒక్క కన్ను కాన రాదు మా చందురూడు

కెరట్టాన్నిఉప్పెన చేసే ఆ  చందురూడు
ఉప్పేనని అలగా మార్చే మా  చందురూడు

పోలవరం పోడు మా చందురూడు
బాబ్లిలో బందులు చేసే మా చందురూడు 

డిల్లీలో రోశయ్య.....
బాబ్లి లో చంద్రయ్య 
తెలుగోడి ఇజ్జత్ మొత్తం 
గిరిపెట్టి గోరి కట్టే 

తెలుగోడి ఇజ్జత్ మొత్తం 
గిరిపెట్టి గోరి కట్టే 

తెలుగోడి ఇజ్జత్ మొత్తం 
గిరిపెట్టి గోరి కట్టే 

Monday 19 July, 2010

ఇచేది మీరే అరె తెచ్చేది మీరే..... నమ్ముకుంటే నట్టేట ముంచేది మీరే

ఇచేది మీరే అరె తెచ్చేది మీరే
ఇచేది మీరే అరె తెచ్చేది మీరే
నమ్ముకుంటే నట్టేట ముంచేది మీరే
నమ్ముకుంటే నట్టేట ముంచేది మీరే

పంతొమ్మిది వందల అరవై తొమిది నుండి ||2||
ఇగ ఇస్తం ఆగ ఇస్తం అని మీరు చెప్పుతుండ్రు ||2||
ఇచ్చుడేమో దేవుడెరుగు తేచినదంతా దోచుకుండ్రు||2||
ఇచుడెందో తెచ్చుడేందో చీకట్ల చిందులేందో||2||


ఇక మిమ్ము నమ్మబోము ఓ సీనన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా హనుమన్నా
ఇక మిమ్ము నమ్మబోము ఓ సీనన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా హనుమన్నా


ఉస్మానియా క్యాంపస్లా ఉద్యమాలు రేగుతుంటే||2||
కాలేజి పోరగాల్ల కాలు చేతులిరుగుతుంటే ||2||
పుట్టకొకడు చేట్టుకొకడు పిట్టలోలె రాలుతుంటే||2||
ఉలుకు లేదు పలుకులేదు ఓదార్పు యాత్ర లేదు||2||


ఇక మిమ్ము నమ్మబోము ఓ సీనన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా ఎంకన్న
ఇక మిమ్ము నమ్మబోము ఓ సీనన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా ఎంకన్న


డిసెంబెర్ నేలమోతం దిష్టి బొమ్మలైనారు||2||
డిల్లి నుండి గల్లిదాక గాజులేసి తిరిగిండ్రు ||2||
సుద్దపూసలోలె మీరు సాపనేక్కి కూసుండ్రు||2||
నీళ్ళు ఉన్న కాడ మీరు నీలాడతనంటారు ||2||

ఇక మిమ్ము నమ్మబోము ఓ సీనన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా కే.కే అన్న
ఇక మిమ్ము నమ్మబోము ఓ సీనన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా కే.కే అన్న

Monday 21 June, 2010

ఉవ్వెత్తున ఎగిసింది తెలంగాణా జ్వాల...తెలంగాణా జ్వాల

ఉవ్వెత్తున ఎగిసింది తెలంగాణా జ్వాల...తెలంగాణా జ్వాల
నలు దిక్కుల పాకింది తెలంగాణా జ్వాల
ఇక చాలు మన ఏడుపులు గుండెలు అవిసేలా ... గుండెలు అవిసేలా
ఖబాడ్డారు ఖబాడ్డారు బాగో ఆంధ్రావాలా


విద్యార్థుల రక్తం తో తడిచిందీ నేల....తడిచిందీ నేల
ఆ రక్తమే రాజింది తెలంగాణా జ్వాల
మనమేంటో చూడాలి లోకం ఈవేల....లోకం ఈవేల
ఖబాడ్డారు ఖబాడ్డారు బాగో ఆంధ్రావాలా

రగులుతుంది తెలంగాణా రుధిరా ధారా కారంగా

రగులుతుంది తెలంగాణా రుధిరా ధారా కారంగా |2 |
పిలుస్తుంది తెలంగాణా కర్ణబేరి పెలంగా |2 |
కదలరా సోదర తెలంగాణా తల్లిరా |2 |
తల్లి చేరాను విడిపించు ఆంధ్రులు చెలరేగంగా |2 |

బాగో బాగో ఆంధ్రవాలే బాగో...... జాగో జాగో తెలంగాణా జాగో.......
బాగో బాగో ఆంధ్రవాలే బాగో...... జాగో జాగో తెలంగాణా జాగో.......

నీ ఆస్తులేమైన మేము అడుగుతున్నామా

నీ అయ్య ముల్లెమైన కూరుతున్నమా...... |2 |
మానీరు, మా నేల, మా కొలువులు కావలి |2 |
మా యాస మా బాష మన్ననలు పొందాలి |2 |
మా హక్కులు అడుగుతుంటే అంత చులకన
వెటకారపు మాటలతో అవహేలనా..... |2 |

బాగో బాగో ఆంధ్రవాలే బాగో...... జాగో జాగో తెలంగాణా జాగో.......
బాగో బాగో ఆంధ్రవాలే బాగో...... జాగో జాగో తెలంగాణా జాగో.......

సాగదు సాగదు ఇక మీదట సాగదు|2 |
ఆగదు ఆగదు మా పోరు ఆగదు...|2 |

బాగో బాగో ఆంధ్రవాలే బాగో...... జాగో జాగో తెలంగాణా జాగో.......
బాగో బాగో ఆంధ్రవాలే బాగో...... జాగో జాగో తెలంగాణా జాగో.......

28-05-10----Konda Surekha's Originality Exposed.....


కొండమ్మ కొండమ్మ కొండమ్మా..... నువ్వు అమ్మ కాదు రాతి బొమ్మమ్మ
కొండమ్మ కొండమ్మ కొండమ్మా..... నువ్వు అమ్మ కాదు రాతి బొమ్మమ్మ
నువ్వు గుండెలు తీసిన బంటమ్మ..
నీది గుండె కాదు మందు గుండమ్మ ||2||


నీకు మనసే లేదు చిన్నమా....నికు మురళి బావ అండదండమ్మ ||2||
ని బావగాడు పెద్దా గుండా అమ్మ...మా గుండెలో దిమ్పిండు గుండు అమ్మ....||2||


ఓ... ఓ.... సురేఖమ్మ......నీ నాటకం యమ కేకమ్మ....||2||
ఈ గుండు ఎట్లా తొలిగేది చెప్పమ్మా....మా బాదేట్లా తీరేది చెప్పమ్మా....||2||


జగన్ గాడు గజ దొంగమ్మ.....చెయ్యి ఎత్తి జే కొట్టకే జేజమ్మ...||2||
నీ పుట్టింట్లో పుట్టింది రుద్రమ్మ...ఆ తల్లి నీడ నీలో లేదమ్మా...||2||


కొండమ్మ కొండమ్మ కొండమ్మా..... నువ్వు అమ్మ కాదు రాతి బొమ్మమ్మ
కొండమ్మ కొండమ్మ కొండమ్మా..... నువ్వు అమ్మ కాదు రాతి బొమ్మమ్మ
నువ్వు గుండెలు తీసిన బంటమ్మ..
నీది గుండె కాదు మందు గుండమ్మ .....